కవితకు షాక్ ఇచ్చిన బీజేపీ పార్టీ…!?

December 4, 2020 at 7:31 pm

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పోటా పోటీగా ఫలితాలు సాధిస్తోంది బీజేపీ పార్టీ. బీజేపీ దూకుడు ముందు టీఆర్ఎస్ నిల్చోలేకపోయింది. ఎంత శ్రమించినా బీజేపీని అడ్డుకోలేకపోయింది. గ్రేటర్ పరిధిలో పలు డివిజన్లకు సంబంధించి గెలుపు బాధ్యతలను తీసుకున్నారు టీఆర్ఎస్ ముఖ్య అదినేతలు అయిన కేటీఆర్, హరీశ్ రావు, ఇంకా కవిత. ఈ నేపథ్యంలో తాము బాధ్యత తీసుకున్న స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించే పనిలో కేటీఆర్, హరీశ్ రావు సక్సెస్ సాధించారు. కానీ ముషీరాబాద్ పరిధిలోని గాంధీ నగర్ డివిజన్ గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకున్న కవిత మాత్రం సాధించలేకపోయారు.

టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన పద్మను గెలిపించేందుకు కవిత చాలా శ్రమ పడ్డారు. డివిజన్‌లోని అనేక ప్రాంతాలకు వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఇంకా సంక్షేమ పథకాల గురించి అక్కడి ప్రజలకు వివరించారు కవిత. ఇంత చేసినా ఫలితం మాత్రం టీఆర్ఎస్‌కు దక్కలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మపై బీజేపీ అభ్యర్థి పావని విజయం పొందారు. దీంతో పద్మ గెలుపు కోసం విపరీతంగా శ్రమించిన కవితకు బీజేపీ భారీ షాక్ ఇచ్చింది.

కవితకు షాక్ ఇచ్చిన బీజేపీ పార్టీ…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts