ఆ షూటింగ్ లో పాల్గొన్న హీరోకి, దర్శకుడికి కరోనా పాజిటివ్…!?

December 4, 2020 at 5:24 pm

బాలీవుడ్‌ స్టార్ హీరో వరుణ్ ధావన్, అందాల భామ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న జగ్ జగ్ జీయో చిత్ర బృందానికి కరోనా దెబ్బ తగిలింది. తాజా సమాచారం ప్రకారం, హీరో వరుణ్ ధావన్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని సమాచారం. వీళ్ళందరికీ చండీగఢ్‌ షూటింగ్‌లో ఉండగా కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి.

కానీ కరోనా టెస్ట్ పరీక్షల్లో సీనియర్‌ హీరో అనిల్‌ కపూర్‌కు మాత్రం నెగిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది. వరుణ్, నీతు, దర్శకుడు రాజ్ కోలుకునేం‍తవరకు ప్రారంభమైన మూవీ షూటింగ్‌ను ప్రస్తుతం ఆపివేసినట్లు తెలుస్తుంది. అయితే తమ ముచ్చట్లను ఎప్పటికపుడు అభిమానులతో పంచుకుంటున్న చిత్ర యూనిట్‌గానీ, నీతూ, వరుణ్‌, అనిల్‌ కపూర్‌గానీ ఇంకా ఈ వార్తలపై స్పందించ పోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమయినా షూటింగ్ లో పాల్గొన్న హీరోకి, దర్శకుడికి కరోనా పాజిటివ్ అనే వార్త జోరుగా వినిపిస్తున్నాయి.

ఆ షూటింగ్ లో పాల్గొన్న హీరోకి, దర్శకుడికి కరోనా పాజిటివ్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts