నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు రిలీజ్ కి రెడీ !!

December 4, 2020 at 6:24 pm

టాలీవుడ్ లో అటు నటుడుగా, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మంచి పేరు సంపాదించుకున్నారు. అష్టా చమ్మా చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆ తరువాత ముగ్గురు, పిల్ల జమీందార్, వర ప్రసాద్ పొట్టి ప్రసాద్ లాంటి పలు సినిమాలో పనిచేసారు. ఊహలు గుసగుసలాడే అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల మరోసారి హీరోగా రానున్నారు . నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ కథని ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మిస్తుండటం మరో విశేషం. డిఫరెంట్ క‌థాంశంతో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అవ‌స‌రాల శ్రీనివాస సరసన చి.ల‌.సౌ ఫేమ్‌ రుహ‌నీ శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఈ సినిమాకి రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి నెల మొదటి తేదీలో కానీ లేదా జనవరి 14న గాని తీసుకువచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు.

నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు రిలీజ్ కి రెడీ !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts