‘ఎఫ్ 3’లో సునీల్‌.. ఇర‌కాటంలో వెంకీ, వ‌రుణ్‌?

December 29, 2020 at 8:20 am

గ‌త ఏడాది సంక్రాంతి కానుక ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన `ఎఫ్ 2` ఘ‌న విష‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా `ఎఫ్ 3` రాబోతున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ కూడా ప్రారంభం అయింది.

ఇక ఈ సీక్వెల్‌లో వెంకీ, వ‌రుణ్‌ల‌తో పాటు కమెడియన్ సునీల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. తాజాగా ఆ సునీల్ పాత్ర గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని, ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. అదే స‌మ‌యంలో ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే పాత్ర‌ని.. అందులోనే సునీల్ నటించబోతున్నాడని తెలుస్తోంది.

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, రీసెంట్‌గా విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌లో వెంకీ, వ‌రుణ్ డ‌బ్బులు ప‌ట్టుకొని ఉండ‌గా.. ఈ మూవీ డ‌బ్బు చుట్టు తిర‌గ‌బోతుందేమోన‌న్న టాక్ న‌డుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

‘ఎఫ్ 3’లో సునీల్‌.. ఇర‌కాటంలో వెంకీ, వ‌రుణ్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts