సూపర్ ఫిట్ సమంత.. మరోసారి ఆశ్చర్యపరిచింది..?

December 4, 2020 at 6:08 pm

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సమంత కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని వారి కోడలు గా మారిన తర్వాత మరింత పెరిగిపోయింది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేసుకుంటూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ దూసుకుపోతుంది సమంత. అయితే నటన విషయంలోనే కాదు ఫిట్నెస్ విషయంలో కూడా అక్కినేని వారి కోడలు సమంత ఎంతో కచ్చితత్వంతో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఫిట్ గా ఉండటానికి ఎప్పుడూ జిమ్లో కసరత్తులు చేస్తూ ఉంటుంది.

అయితే జిమ్లో కసరత్తులు చేయడంతోపాటు యోగా కూడా చేస్తూ ఉంటుంది అక్కినేని వారి కోడలు సమంత. ఇక ఇటీవల నాగచైతన్య తో కలిసి మాల్దీవులకు వెళ్లి ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న సమంత మళ్లీ వర్కౌట్స్ ప్రారంభించింది తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియో ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది సమంత. నిపుణుడి పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తున్న వీడియో ని సమంత ఇంస్టాగ్రామ్ లో స్టోరీస్ లో పోస్టు చేయగా ప్రస్తుతం ఇది చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సూపర్ ఫిట్ సమంత.. మరోసారి ఆశ్చర్యపరిచింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts