
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. మరికొన్నిగంటల్లోనే గ్రేటర్ పీఠం ఎవరిది అన్న విషయం తేలిపోనుంది. ప్రస్తుతం కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉన్నా.. సాధారణ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీనే దూసుకుపోతుంది. ఇక తాజాగా టీఆర్ఎస్ పార్టీ ఓ స్థానంలో విజయకేతనం కూడా ఎగరవేసింది.
యూసుఫ్ గూడ డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న తొలి స్థానం ఇదే కావడం విశేషం. ఇక్కడ టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన బండారి రాజ్ కుమార్ పటేల్ బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.
ఇక ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, హఫీజ్ పేట్, బాలా నగర్, సరూర్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, కాప్రా, ఓల్డ్ మలక్పేట్, చర్లపల్లి, మీర్ పేట్ హెచ్బి కాలనీ, భారతీనగర్, పటాన్ చెరువు, ఆర్సీపురం, ఛందానగర్, హైదర్ నగర్, జూబ్లీ హిల్స్ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.