చరణ్‌తో పాటు క్వారంటైన్‌లో ఉపాసన.. క‌రోనా టెస్ట్‌లో.. ?

December 30, 2020 at 7:56 am

ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా వైర‌స్‌.. ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్నారు. సామాన్యులే కాకుండా సెల‌బ్రెటీలు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే మెగా హీరోల్లో రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌లు క‌రోనా బారిన ప‌డ్డారు.

అది కూడా కొన్ని గంటల గ్యాప్‌లోనే వాళ్లకు కరోనా వచ్చినట్లు ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు హీరోలకు కూడా లక్షణాలు పెద్దగా లేకపోవడం వ‌ల్ల ఇంట్లో క్వారంటైన్ అయ్యారు. ఇదిలా ఉంటే.. రామ్ చ‌ర‌ణ్‌కు క‌రోనా రావ‌డంతో ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న కూడా క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్‌లో నెగ‌టివ్ వ‌చ్చింది.

అయిన‌ప్ప‌టికీ, భ‌ర్త చ‌ర‌ణ్‌తోనే ఆమె కూడా క్వారంటైన్‌లో ఉంటుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలుపుతూ.. కరోనా టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌గా తేలింది. అయినా పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో చ‌ర‌ణ్‌తో క్వారంటైన్‌లో ఉన్నామని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంతేకాకుండా సోషల మీడియాలో చేసిన పోస్టులో మిస్టర్ సీతో ఉన్నానని రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

చరణ్‌తో పాటు క్వారంటైన్‌లో ఉపాసన.. క‌రోనా టెస్ట్‌లో.. ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts