వైరల్ అవుతున్న అవికా గోర్ డాన్స్ వీడియో.. భలే చేసిందే..!?

December 3, 2020 at 4:09 pm

చిన్నారి పెళ్ళికూతురు అనే ధారావాహిక తో తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గర అయిపోయిన అవికాగోర్ ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేసింది అనే విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇక ఇటీవలే రాజుగారి గది 3 అనే హారర్ సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించిన విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం కాస్త సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు. ఇక ఈ గ్యాప్లో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది అవికాగోర్. ఎప్పుడు బొద్దుగా ఉండి ప్రేక్షకులను మైమరపించే అవికాగోర్ కాస్త ప్రస్తుతం ఎంతో సన్నగా నాజూగ్గా మారిపోయింది. ఇదిలాఉంటే ఇటీవలే.. ఓ డాన్స్ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో కాస్త వేగంగా మారిపోయింది తన కొరియోగ్రాఫర్ తో కలిసి డాన్స్ చేసిన వీడియో ని పోస్ట్ చేసింది. డాన్స్ చూసిన అభిమానులు వావ్ అంటున్నారు.  https://www.instagram.com/p/CIUlDZQg1Md/?utm_source=ig_web_copy_link

వైరల్ అవుతున్న అవికా గోర్ డాన్స్ వీడియో.. భలే చేసిందే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts