నాగార్జున‌కు వంట‌ల‌క్క బిగ్ షాక్‌.. బిగ్‌బాస్ ఎత్తులు చిత్తు చిత్తు!

December 4, 2020 at 8:27 am

బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ 13 వారానికి వ‌చ్చేసింది. షో చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతున్న వేళ బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఇక‌పై ప్ర‌తి ఎపిసోడ్‌ను రంజుగా మార్చేందుకు కొత్త ఎత్తులు, ప్రాణాలిక‌లు వేస్తున్నారు. అయితే ఎన్ని ఎత్తులు వేసి.. షోను ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మార్చినా టీఆర్పీ విష‌యంలో మాత్రం వెన‌క‌ప‌డిపోతోంది.

ముఖ్యంగా బుల్లితెర బాహుబ‌లిగా పిలుచుకునే కార్తీక‌దీపం సీరియల్‌ను బీట్ చేయ‌డం కాదు కదా.. దరిదాపుల్లో కూడా ఉండ‌టం లేదు బిగ్ బాస్. ఈ సీరియ‌ల్‌లో మెయిన్ క్యారెక్ట‌ర్ అయిన‌ వంట‌ల‌క్కను ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. చాలా మంది ఆమె కోస‌మే సీరియ‌ల్ చూస్తారు అన‌డంలో కూడా సందేహం లేదు. అంత‌లా వంట‌ల‌క్క ప్రేక్ష‌కుల‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆ సీరియ‌ర్ రేటింగ్స్ ఎప్పుడూ పీక్స్‌లో ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన 42వ వారం బార్క్ రేటింగ్స్ చూస్తే వంటలక్క దెబ్బకు నాగార్జున కూడా వెనుకడుగేయక తప్పలేదు. 42వ వారం రేటింగ్స్‌లో కార్తీక దీపం సీరియల్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాటు, వదినమ్మ, కోయిలమ్మ, మౌనరాగం సీరియల్స్ ఉన్నాయి. టాప్ 5 ప్రోగ్రామ్స్‌లో అసలు బిగ్ బాస్ కనిపించకపోవడం గమనార్హం. ఏదేమైనా వంట‌ల‌క్క ముందు బిగ్ బాస్ ఎత్తులు అన్నీ చిత్తు చిత్తు అయ్యాయి అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

నాగార్జున‌కు వంట‌ల‌క్క బిగ్ షాక్‌.. బిగ్‌బాస్ ఎత్తులు చిత్తు చిత్తు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts