వరుణ్ తేజ్‌కు క‌రోనా‌.. మెగా ఫ్యామిలీని టెన్ష‌న్ పెడుతున్న వైర‌స్‌!

December 29, 2020 at 4:50 pm

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యులే కాకుండా సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడాకారులు ఇలా అంద‌రూ క‌రోనా నుంచి త‌ప్పించ‌కోలేక‌పోతున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీలో క‌రోనా వైర‌స్ టెన్ష‌న్ పెడుతుంది.

మంగ‌ళ‌వారం ఉద‌యం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు క‌రోనా సోకింద‌న్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో.. అభిమానులు తెగ ఆందోళ‌న చెందారు. అయితే ఇప్పుడు మ‌రో మెగా హీరో కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న ఎవ‌రో కాదు.. నాగబాబు త‌న‌యుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

త‌న‌కు క‌రోనా సోకిన‌ట్టు స్వ‌యంగా వ‌రుణ్ తేజ్‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా స్ప‌ష్టం చేశారు. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని వరుణ్‌ తేజ్‌ తెలిపాడు . ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉన్నట్టు తెలిపాడు వరుణ్. దీంతో మెగా ఫ్యాన్స్‌లో కంగారు మొద‌లైంది.

వరుణ్ తేజ్‌కు క‌రోనా‌.. మెగా ఫ్యామిలీని టెన్ష‌న్ పెడుతున్న వైర‌స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts