
గత ఏడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుఆ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన `ఎఫ్ 2` ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా `ఎఫ్ 3` రాబోతున్న సంగతి తెలిసిందే.
ఎఫ్ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు ‘ఎఫ్ 3’ని కూడా నిర్మించనున్నారు. అలాగే ఈ చిత్రంలో మరోసారి తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి మోర్ ఫన్‌తో రాబోతున్న ఎఫ్ 3 షూటింగ్‌ను బుధవారం షురూ చేశాడు అనిల్ రావిపూడి. హైదరాబాద్ లో ప్రారంభమైన షూటింగ్ లో వెంకీతో సోలో సీన్లను షూట్ చేసాడు అనీల్.
ఈ క్రమంలోనే ఎఫ్ 3 షూట్ బిగెన్స్ అంటూ ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను మూడు నెలల్లో పూర్తి చేసి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరిపి సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కాగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి మరికొందరు నటిస్తున్నారు.