విజయ్ సేతుపతితో అన‌‌సూయ ఆనంద‌ క్షణాలు.. ఫొటోలు వైర‌ల్‌!‌

December 4, 2020 at 11:27 am

యాంక‌ర్ అన‌సూయ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర స్టార్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన అన‌సూయ‌.. వెండితెర‌పై సైతం న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా తెలుగు వారికి విప‌రీతంగా అల‌రించింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు `థ్యాంక్యూ బ్రదర్` అనే చిత్రంలో ప్రెగ్నెంట్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌ల ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ బాగానే ఆక‌ట్టుకుంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా అన‌సూయ మ‌యా యాక్టివ్. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. అయితే ఈ భామ తాజాగా ఓ స్టార్ హీరోతో గడిపిన ఆనంత క్షణాలను అభిమానుల‌తో పంచుకుంది. ఇంత‌కీ ఆ స్థార్ మీరో ఎవ‌రో కాదు.. విజయ్ సేతుపతి. ఆ ఫొటోలో తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతితో వయ్యారంగా సిగ్గులు ఒలకబోస్తూ అన‌సూయ క‌నిపించింది.

`బ్రిలియన్స్ తో బాండింగ్.. నిజంగా మక్కల్ సెల్వన్` అంటూ తనదైన స్టైల్ లో కామెంట్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే విజయ్‌ సేతుపతితో అనసూయ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు కలిసిందనేది తెలియ‌డం లేదు. ఒక‌వేళ విజ‌య్ సేతుప‌తి సినిమాలో ఏమైనా ఆమె న‌టిస్తుందా అన్న ప్ర‌శ్న‌లు కూడా రైస్ అవుతున్నారు. మ‌రి అన‌సూయ నోరు విప్పే వ‌ర‌కు విజ‌య్‌ను ఎందుకు క‌లిసిందో తెలియ‌దు.

మరోవైపు విజయ్‌ సైతం నవ్వుతున్నారు. వారి మధ్య సరదా సన్నివేశం జరుగుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్టుంది. ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, `బాండింగ్‌   విత్‌ బ్రిలియన్స్ ` అనే పేర్కొంటూ తన ఫోటోలను పంచుకుంది.

విజయ్‌ సేతుపతితో అనసూయ దిగిన ఫోటో ఆకట్టుకుంటుంది. ఇందులో వైట్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది అనసూయ. చిలిపిగా నవ్వుతూ పోజులిచ్చింది.

విజయ్ సేతుపతితో అన‌‌సూయ ఆనంద‌ క్షణాలు.. ఫొటోలు వైర‌ల్‌!‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts