రవి తేజ సినిమాలో విలన్ ఎవరో తెలుసా…!?

December 2, 2020 at 5:02 pm

మలినేని దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేస్తుంది.ఇదివరకు మలినేని రవితేజ కాంబోలో డాన్ శ్రీను, బలుపు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ కు సిద్దమవుతున్న సమయంలో మరో సినిమాకు పచ్చ జెండా ఇచ్చాడు రవి తేజ. ఈ చిత్రంలో మాస్‌ హీరో ఉన్నాడు మరి విలన్ ఎవరని అందరిలో అప్పుడే ఆలోచన మొదలైంది.

ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్వకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన హీరోయిన్స్‌గా అను ఇమాన్యుయల్, మీనాక్షి చౌదర్లు చేస్తున్నారిని వార్తలు వచ్చాయి. కానీ హీరోకు పోటీ ఇవ్వాల్సిన విలన్ ఎవరని తెగ చర్చలు మొదలయ్యాయి. అయితే సినీ వర్గాల టాక్ ప్రకారం చిత్ర యూనిట్ ఓ స్టార్ హీరోను ఈ మూవీలో విలన్‌గా తీసుకురాబోతున్నారని సమాచారం. ఇప్పటికే చాలా సినిమాల్లో నెగిటివ్ కారెక్షర్లు వేసి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ స్టార్ అర్జున్ సార్జా నే ఈ మూవీలో కూడా విలన్‌గా చేయనునట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రవి తేజ సినిమాలో విలన్ ఎవరో తెలుసా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts