ఒకే సినిమాలో పూజా హెగ్డే, రష్మిక.. ఇక అభిమానులకు పండగే..?

December 3, 2020 at 3:27 pm

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన… వరస సినిమా లతో దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు విజయంతో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించిన ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇక మరోవైపు పూజా హెగ్డే కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ అమ్మడు.

అయితే త్వరలో రష్మిక మందన పూజా హెగ్డే కలిసి నటించబోతున్నారా అంటే అవుననే టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది. పడి పడి లేచే మనసు సినిమా తర్వాత దర్శకుడు హను రాఘవపూడి దుల్కర్ సల్మాన్ తో సినిమా ప్రకటించారు. ఇక ఈ సినిమా వివిధ భాషల్లో తెరకెక్కించేందుకు అంతా సిద్ధమవుతున్నది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందుకోసం పూజా హెగ్డే, రష్మిక ను సెలెక్ట్ చేయనుందట చిత్ర బృందం. ఇక దీని కోసం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

ఒకే సినిమాలో పూజా హెగ్డే, రష్మిక.. ఇక అభిమానులకు పండగే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts