
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది వాట్సాప్. తాజాగా మరో కొత్త అప్డేట్ను ప్రవేశపెట్టింది వాట్సాప్. దీని ద్వారా ఛాటింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఛాట్ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. దీనికోసం కొత్తగా వాల్‌పేపర్ గ్యాలరీని అప్డేట్ చేశారు వాట్సాప్‌లో . దీనితో పాటు టెక్ట్స్, ఎమోజీ సహాయంతో స్టిక్కర్స్ వెతికే ఫీచర్‌ని కూడా తీసుకొచ్చారు.
కస్టమ్ వాల్‌పేపర్ ఫీచర్లో భాగంగా కొత్త వాల్‌పేపర్ ఎంచుకునేందుకు మీరు ఛాట్ చేసే వ్యక్తి లేదా గ్రూప్ ఇన్ఫో పై క్లిక్ చేసి కింద ఉన్న వాల్‌పేపర్ అండ్ సౌండ్‌పై క్లిక్ చేస్తే చాలు. తర్వాత మీకు కొత్త వాల్‌పేపర్స్ లిస్ట్ వస్తుంది. వాటిలో కొత్తగా 32 బ్రైట్ వాల్‌పేపర్స్, 30 డార్క్ వాల్‌పేపర్స్ ఇస్తున్నారని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో చెప్పారు. వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అధికారికంగా రిలీజ్ చేసినప్పటికీ కేవలం కొంత మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అతి త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వారు తెలిపారు.