BB4 : ఫినాలే కు అతిధిగా మరో స్టార్ హీరో రాబోతున్నా డా..!?

December 4, 2020 at 7:04 pm

మొదలైన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది. షో ముగింపు ‌ వచ్చిన సమయంలో ఆట మరింత రసవత్తరంగా తీర్చిదిద్దారు షో నిర్వాహకులు. ఫినాలే చేరుకున్న హౌస్ మేట్స్ మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక నాల్గో సీజన్‌ ఎండింగ్ మరి కొద్ది రోజుల్లో అంటే డిసెంబర్‌ 20న ఫినాలే జరుగుతుందని అంచనా వేస్తున్నారు.బిగ్ బాస్ షోని గ్రాండ్‌గా కంక్లూడ్‌ చేసేందుకు భారీగా ప్లాన్‌ చేస్తున్నారట నిర్వాహకులు.

ఎప్పటిలానే ఈ సారి కూడా ఫైనల్‌కి ఓ ప్రముఖ ‌ హీరోని స్పెషల్ గెస్ట్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ఫైనల్‌కి మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా వచ్చి మెగా ఎండింగ్ ఇచ్చాడు. రెండో సీజన్‌కు విక్టరీ వెంకటేష్‌ వచ్చి గ్రాండ్‌ గా ఫినిషింగ్ ఇచ్చాడు. మరి ఈ సారి గ్రాండ్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. మరి ఫినాలేకు స్పెషల్ గెస్ట్ గా ఏ స్టార్‌ వచ్చి సందడి చేస్తారో వేచి చూడాల్సిందే.

BB4 : ఫినాలే కు అతిధిగా మరో స్టార్ హీరో రాబోతున్నా డా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts