అతి త్వరలోనే కేంద్రంలో నాగబాబుకు కీలక పదవి…!?

January 9, 2021 at 2:18 pm

మెగా బ్రదర్ అయిన నాగబాబుకు త్వరలో కేంద్రంలో కీలక పదవి దక్కనుందని బిజేపీ జనసేన వర్గాల సమాచారం. దానికోసం చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నట్టు తెలుస్తుంది. నాగబాబు సంగతి కొస్తే నాగబాబు అటు నటుడిగా, నిర్మాతగా, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, పవన్ కళ్యాణ్ అన్నగా ఇంకా జబర్దస్త్ కామెడీ షోతో పాటు అదిరింది వంటి ప్రోగ్రామ్స్‌తో జనాలకు దగ్గరయ్యారు. గత 2019 ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరుపున ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసారు. కానీ . ఆ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇంకా నాగబాబు ఇద్దరు ఓడిపోయారు. ఐతే ఇకమీదట నాగబాబు రాజకీయాల్లో బిజీ కావాలనే గెట్టి నిర్ణయానికి వచ్చినట్టు వినికిడి.

ఇప్పటకీ జనసేనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉంది. ఈ క్రమంలో తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా బీజేపీకి సపోర్ట్‌ చేస్తోంది. దీనికి ప్రతి ఫలంగా వచ్చే టర్న్‌లో ఖాళీ అయ్యే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ , జనసేన పొత్తులో భాగంగా ఓ రాజ్యసభ సీటు జనసేనకు కేటాయించాలనేది జనసేన షరతు పెట్టినట్టు వార్త. అందులో భాగంగా జనసేన తరుపున రాజ్యసభకు అన్నయ్య నాగబాబును పంపించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నాగబాబు రాజకీయాలతో పాటు సామాజిక సమస్యలపై ద్రుష్టి సారించారు. ఇకమీదట భవిష్యత్తులో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే కొనసాగాలనే నిర్ణయానికి నాగబాబు వచ్చినట్టు సన్నిహిత వర్గాలు ద్వారా సమాచారం అందింది. త్వరలోనే ఈ విషయమై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

అతి త్వరలోనే కేంద్రంలో నాగబాబుకు కీలక పదవి…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts