దుబాయ్‌ నుంచి సిగ‌రెట్లు స్మ‌గ్లింగ్‌

January 8, 2021 at 11:56 am

అధికారులు ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నా స్మ‌గ్ల‌ర్లు త‌మ అక్ర‌మ దందాను కొన‌సాగిస్తున్నారు. కాసులు వ‌స్తే అది ఏదైనా స‌రే అక్ర‌మంగా తీసుకొచ్చేందుకు సిద్ధ‌మైపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల నుంచి బంగారాన్ని మాత్ర‌మే తీసుకొచ్చే స్మ‌గ్ల‌ర్లు ఇప్పుడు సిగ‌రెట్ల‌పైనా ప‌డ‌డం గ‌మ‌నార్హం. తాజాగా దుబాయ్ నుంచి బంగారంతో పాటు ల‌క్ష‌ల విలువ చేసే సిగ‌రెట్ల‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా దేశానికి తీసుకొస్తున్న నిందితుడిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

7వ తేదీన‌ తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్ వ‌చ్చిన‌ ఫ్లైట్ నంబర్ IX 1948 లోని ప్రయాణీకుల‌కు సాధార‌ణ త‌నిఖీల‌ను నిర్వ‌హించారు అధికారులు. అందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్య‌క్తి వ‌ద్ద డిపై గోల్డ్ బార్స్ మరియు సిగరెట్లను గుర్తించారు. వెంట‌నే స‌ద‌రు నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అవి అక్రమంగా త‌ర‌లిస్తున్నాడ‌ని గుర్తించారు. స‌ద‌రు వ్య‌క్తిపై కేసును న‌మోదు చేశారు. ఇక‌ స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల బరువు 349.800 గ్రాములు కాగా, మార్కెట్ విలువ‌ రూ .18.36 లక్షలు . సిగరెట్లు విలువ రూ. 1,20,000 ల‌ని నిర్ధారించారు. వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు అధికారులు.

దుబాయ్‌ నుంచి సిగ‌రెట్లు స్మ‌గ్లింగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts