
సమాజంలో ఏ చిన్న సమస్య వచ్చినా చావునే పరిష్కార మార్గంగా ఎంచుకుంటున్నారు కొందరు. విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తల్లదండ్రుల ఆశలను చంపేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. చదువుల భారం మోయలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ విద్యార్థి. ఏకంగా సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరిపోసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసీ దంపతులకు తిరుమలేశ్ ఒక్కగానొక్క కుమారుడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రస్తుతం బీటెక్ పైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొవిడ్ నేపథ్యంలో తిరుమలేశ్ ఇంటివద్దే ఉంటుండగా, నాలుగు రోజుల క్రితమే తిరిగి కాలేజీకి వెళ్లాడు. ఏమైందో ఏమో కానీ.. బిల్డింగ్పై నుంచి కాపాడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే
చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మిత్రులకు పంపాడు తిరుమలేశ్. వారు గుర్తించే లోపే బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలను విడిచాడు. ఇక ఆ వీడియోలో “అమ్మా.., నేనూ ఫెయిల్యూర్ గా మిగిలిపోయా… చదువులో ముందుకు వెళ్లలేకపోతున్నానమ్మా.. మీరు కష్టపడి పెంచిన ఈ జీవితానికి ఇక సెలవమ్మా ..,”ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేక పోతున్నా..మీ ఆశల్ని నెరవేర్చలేక పోతున్న. మిమ్మల్ని విడిచి వెళ్తున్నా. నాకు సహాయం చేసిన వారందిరికి కృతజ్ఞతలు. నన్ను క్షమించండి.” అంటూ తన చివరి మాటలను రికార్డ్ చేశాడు. ఒక్కగానొక్క కుమారుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కడుపులోని బాధను సైతం దిగమింగుకొని కుమారుడి నేత్రాలను ఎల్వీప్రసాద్ కంటి వైద్యశాలకు దానం చేశారు. మరోవైపు తిరుమలేశ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థులను విచారిస్తున్నారు. ఆత్మహత్యకు చదువుల ఒత్తిడే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.