శశి సినిమా విడుదల అప్పుడే నట…!?

January 16, 2021 at 2:50 pm

యువ నటుడు హీరో ఆది సాయికుమార్‌ తన రాబోయే కొత్త చిత్రం శశిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మూవీ విడుదలపై మేకర్స్‌ తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 12వ తేదీన థియేటర్లలోకి రిలీజ్ కానుంది. ఈ మూవీకి శ్రీనివాసనాయుడు నాడికట్ల దర్శకత్వం వహించారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రంలో ఆది మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. శశి చిత్రానికి సంబంధించి టీజర్‌ను గత నెలలో మూవీ బృందం రిలీజ్ చేశారు. ఈ మూవీలో సురభి, రాశిసింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల, రాధిక, అజయ్‌ సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె విజయ భాస్కర్ దర్శకత్వంలో 2011లో రిలీజ్ అయిన ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి చిత్రంతో ఆది తెరంగ్రేటం చేశాడు. చివరిసారిగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌ మూవీలో కనిపించాడు.

శశి సినిమా విడుదల అప్పుడే నట…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts