
స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో కలిసి నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య చిత్రంలో ఒక్క కీ రోల్ కోసం మేకర్స్ పూజనీ సంప్రదించినట్టు పలు వార్తలు వచ్చాయి.
రాంచరణ్ గెస్ట్ రోల్ చేస్తుండగా పూజాహెగ్డే రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్నట్టు సమాచారం. అయితే పూజాహెగ్డే ఈ సినిమాకి సంతకం చేయాలంటే మేకర్స్ కు ఓ కండిషన్ పెట్టిందట పూజా. తనకు పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తేనే ఈ చిత్రంలో నటిస్తానని షరతు పెట్టిందట. ఈ అందాల భామకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పూజా డిమాండ్‌కు మూవీ మేకర్స్ కూడా పచ్చ జెండా ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.