నర్సింగ్ యాదవ్ ఫ్యామిలీని పరామర్శించిన నరేశ్!!

January 12, 2021 at 4:07 pm

ఇటీవలే ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ డిసెంబర్ 31న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కిడ్నీ సమస్యతో గురువారం డిసెంబర్ 31 న కన్నుమూశారు. నర‌సింహ యాద‌వ్‌‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. నర్సింగ్ యాదవ్ గత 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేశారు.

రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. వివిధ భాషల్లో దాదాపు మూడు వందల సినిమాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనూ తనదైన పాత్రను పోషించారు. ఈ క్రమంలో మా అధ్యక్షుడు ప్రముఖ నటుడు నరేశ్ సుల్తాన్ బజార్ లోని నర్సింగ్ యాదవ్ ఇంటికి వెళ్ళి, అతని భార్య, కుమారుడిని కలిసి పరామర్శించి వచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున రాబోయే రోజుల్లోనూ నర్సింగ్ యాదవ్ కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

నర్సింగ్ యాదవ్ ఫ్యామిలీని పరామర్శించిన నరేశ్!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts