ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ నటి…!?

January 27, 2021 at 1:49 pm

ప్రముఖ సినీ నటి అనుష్క సైబరాబాద్ లో డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వెహికల్స్ ని ప్రారంభించారు. ఫ్రీ షీ షటిల్ బస్ లను అనుష్కతో పాటుగా, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ సజ్జానార్ కలిసి ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం షీ పాహి, ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అధికారులతో పాటు ముఖ్య అతిథిగా నటి అనుష్క హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో అనుష్క మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్ అని ఆమె అన్నారు. కోవిడ్ సమయంలో పోలీస్ లు చాలా బాగా పని చేశారు. నన్ను ఇలాంటి కార్యక్రమ కు పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. షీ పాహి అనే పేరు చాలా బాగుంది. సమాజం లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని అనుష్క తెలిపారు.

ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ నటి…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts