
నమిత.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `సొంతం` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నమిత.. ఆ తర్వాత జెమిని, ఒక రాజు-ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి, ఐతే ఏంటి ఇలా వరుస సినిమాలు చేసింది. అయితే కెరీర్ ప్రారంభంలో సన్నగా ఉన్న నమిత.. ఆ తర్వాత బొద్దుగా మారిపోయింది.
ఇక హీరోయిన్లంతా జీరోసైజ్ ఫిగర్ మెయిన్‌టెయిన్ చేస్తుంటే… నమిత మాత్రం ఫుల్ సైజు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సౌతిండియాలో ఖుష్బూ తర్వాత ఆ రేంజ్ లో నమిత ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ, పెళ్లి తర్వాత మాత్రం ఈ బ్యూటీ సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయింది.
ఇందులో భాగంగా.. ప్రస్తుతం నమిత జీరో సైజ్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రోజు వ్యాయామాలు చేస్తూ.. ఇప్పటికే చాలా వరకు బరువు తగ్గిన నమిత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. దీంతో ఇవి చూసిన నెటిజన్లు మరియు అభిమానులు షాక్ అవుతున్నారు. మరి ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.