లైట్ వెయిట్ వర్కవుట్స్‌తో మిల్కీ బ్యూటీ..!!

January 22, 2021 at 3:52 pm

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా అగ్ర హీరోలందరితో కలిసి నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవల తమన్నా కరోనా బారిన పడి తిరిగి కోలుకున్న తరువాత ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రోజు క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ తన వర్కవుట్ వీడియోను సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తమన్నా తనకు తగ్గట్టు లైట్ వెయిట్ వర్కవుట్స్ చేస్తూ చాలా నాజూగ్గా కనిపించింది.

ఈ వీడియోను ఉద్దేశిస్తూ తమన్నా నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చాలు. వ్యాయామానికి మరీ ఎక్కువగా కూడా కష్టపడాల్సిన అవసరం లేదని, నిలకడగా చేస్తే చాలంటూ తమన్నా పోస్ట్ చేసింది. చాలా ఏళ్ల నుంచి తన గ్లామర్ ను మైంటైన్ చేస్తూ వచ్చిన తమన్నా కరోనా టైములో కాస్త లావెక్కింది. ఆ తరువాత తన రాబోయే సినిమాల కోసం మరలా తమన్నా ఇదివరకటి లాగే మరింత ఫిట్‌గా తయారైయిందనే చెప్పాలి. ప్రస్తుతం తమన్నా హీరో గోపీచంద్ సరసన సీటీమార్ చిత్రంలో చేస్తుంది.

లైట్ వెయిట్ వర్కవుట్స్‌తో మిల్కీ బ్యూటీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts