వైరల్ వీడియో : అందాల భామ అదా శర్మ విన్యాసాలు చూశారా..!?

January 27, 2021 at 2:15 pm

దర్శకుడు పూరీ జగన్నాథ్ హార్ట్‌ ఎటాక్‌ చిత్రం ద్వారా టాలీవుడ్‌కుఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ అదాశర్మ. ఆ సినిమా తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అందాల భామ బాలీవుడ్‌, వెబ్‌ సిరీస్‌లపై ద్రుష్టి పెట్టింది. ఇక మూవీస్ కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ మంది ఫాన్స్ ని సంపాంధించుకుంటుంది ఈ అందాల భామ ఆదా. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులో హీట్ పుట్టిస్తుంది.

వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఆదా. ఇటీవల సముద్రపు ఒడ్డున చీరకట్టులో పల్టీ కొడుతూ జంప్స్ చేస్తూ దర్శనం ఇచ్చిన ఈ భామ ఇప్పుడు తాజాగా నాంచాక్‌ తిప్పుతూ కనిపించింది. సముద్ర తీరంలో వైట్ అండ్ వైట్ కరాటే డ్రెస్ వేసుకుని నాంచాక్ తిప్పింది. ప్రస్తుతం ఆదా డేర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో : అందాల భామ అదా శర్మ విన్యాసాలు చూశారా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts