గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఓపెన్ అయిన అడివిశేషు.. ఖుషీలో ఫ్యాన్స్‌!

January 27, 2021 at 12:48 pm

అడివిశేషు.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సొంతం` సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అడివిశేషు.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న అడివిశేషు.. ప్ర‌స్తుతం ప్రస్తుతం మేజర్ చిత్రంలో నటిస్తున్నారు.

26/11 ముంబయి ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శేషు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా కనిపించనున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వ‌హించ‌నున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ మహేశ్ బాబు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అడివి శేషు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

ఈ ఇంట‌ర్వ్యూలో గూఢచారి సినిమా తరహాలో గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ప్రశ్నించగా.. అందుకు శేషు తన రియల్ లైఫ్‌లో కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని బదులిచ్చాడు. అయితే ఆమె ఎవ‌రు అన్న‌ది మాత్రం రివిల్ చేయ‌లేదు. అలాగే తన పెళ్లి గురించి ఇంట్లో వారు గొడవ చేస్తున్నారని శేషు చెప్పుకొచ్చాడు. శేషు మాట‌ల ప్ర‌కారం చూస్తే.. త్వ‌ర‌లోనే ఈయ‌న కూడా పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడ‌ని అంటున్నారు. కాగా, గ‌తంతో కింగ్ నాగార్జున మేనకోడలు, నటి సుప్రియతో హీరో అడివి శేష్ పెళ్లి జరుగబోతోందన్న వార్త వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ, అవి చివ‌ర‌కు రూమ‌ర్లే అని శేషు తేల్చేశాడు.

గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఓపెన్ అయిన అడివిశేషు.. ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts