సింగర్ సునీత, భర్త రామ్ మ‌ధ్య ఎంత వ‌య‌సు తేడా ఉందో తెలుసా?

January 20, 2021 at 9:51 am

టాలీవుడ్ స్టార్ సింగ‌ర్స్‌లో ఒక‌రైన సునీత ఇటీవ‌ల మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అమ్మపల్లి సీతారాముల ఆలయంలో జ‌న‌వ‌రి 9న సునీత‌-రామ్‌ల వివాహం పెద్ద స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇక వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉంటే.. సునీత రెండో పెళ్లి చేసుకుంద‌న్న విష‌యం తెలియ‌గానే.. ఇంత‌కీ ఆ వ‌రుడు ఎవ‌రు.. అత‌డి వ‌య‌సు ఎంత‌.. సునీత‌కు, అత‌డికి ఎంత వ‌య‌సు తేడా ఉంది అన్న ప్ర‌శ్న‌లు సెర్చ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే సునీత రెండో వివాహం చేసుకున్న వ్య‌క్తి రామ్ వీరపనేని. ఈయ‌న పూర్తి పేరు రామకృష్ట వీరపనేని.

ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వ‌చ్చిన రామ్‌.. డిజిటల్ మీడియా రంగంలో అడుగు పెట్టి సూప‌ర్‌గా స‌క్సెస్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో ఆస్తులు కూడా సంపాదించారు. ఇక రామ్ వ‌య‌సు 47 ఏళ్లు. ఈయ‌న మే 26, 1974న జన్మించాడు. సునీత వయసు 42 ఏళ్ళు. అంటే సునీత‌-రామ్‌ల‌ వయసులో కేవలం ఐదేళ్లు మాత్రమే గ్యాప్ ఉంది. ఇక ముందు నుంచి కూడా ఇద్దరూ మంచి స్నేహితులు. పైగా వయసు గ్యాప్ కూడా తక్కువగానే ఉండటంతో ఇద్ద‌రూ దాంప‌త్య జీవితం వైపు అడుగులు వేశారు.

సింగర్ సునీత, భర్త రామ్ మ‌ధ్య ఎంత వ‌య‌సు తేడా ఉందో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts