రవి తేజా ‘క్రాక్’కు అల్లు అరవింద్ సపోర్ట్ …!

January 26, 2021 at 3:12 pm

సంక్రాంతి పండుగ సమయంలో వచ్చిన చిత్రాల్లో మాస్ మహరాజా రవితేజ క్రాక్ సినిమా ప్రథమ స్థానం సాధించింది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా దర్శకుడు మలినేని గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా క్రాక్ చక్కని వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే జనవరి 29న ఆహాలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ జరిపేందుకు అగ్రిమెంట్ రాసుకున్నారు మూవీ నిర్మాతలు. కానీ ఇప్పుడు మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించటంతో , ఇంకా మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమౌతున్న క్రమంలో నిర్మాతలు ఆహాలో టెలికాస్ట్ గురించి పునరాలోచనలో పడ్డారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయితే సినిమాకి ఊపు తగ్గుతుందని మూవీ నిర్మాతలు ఆహా యాజమాన్యానికి తమ మదిలో మాటను తెలిపారు. దాంతో ఆ సంస్థ సానుకూలంగా స్పందించి, మూవీ ఇండస్ట్రీ లో భాగమైన తాము అన్ని రకాలుగా చిత్రాన్ని నిలబెట్టడం కోసం తమ వంతు ప్రయత్నిస్తామని, అందుకే జనవరి 29న స్ట్రీమింగ్ జరపాల్సిన క్రాక్ ను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశామని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ నిర్ణయంతో ఆహా సబ్ స్క్రైబర్స్ కొంత నిరాశకు గురైనా క్రాక్ చిత్ర నిర్మాతలకు ఇది కాస్త ఊరట కలిగించే విషయమే.

రవి తేజా ‘క్రాక్’కు అల్లు అరవింద్ సపోర్ట్ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts