సరి కొత్త రికార్డును సొంతం చేసుకున్న హీరో అజిత్..!?

January 19, 2021 at 3:35 pm

సాధారణంగా బైక్ రేసింగ్ లు ఇంకా ఛేజింగ్ లు లాంటివి హాలీవుడ్ మూవీస్ తో పాటు బాలీవుడ్ మూవీలలో కూడా మనం చూస్తుంటాం. కానీ రియల్ గా బైక్ ఛేజింగ్, రేసింగ్ లు అంటే మాత్రం ఒకింత ఒళ్ళు గగుర్లు పుడతాయి .పొరపాటున ఏ మాత్రం తప్పు జరిగినా ప్రాణాలకీ ముప్పు. కానీ ఎంత రిస్క్ అయినా ఈ బైక్ రేసింగ్ అంటే తెగ ఇష్ట పడుతుంటారు కొందరు. ఈ కోవకే చెందుతారు తమిళ స్టార్ హీరో అజిత్. ఆయనకి కూడా బైక్ డ్రెవింగ్ అన్నా బైక్ పై లాంగ్ జర్నీ అన్నా చాలా ఇష్టమనే సంగతి అందరికి తెలుసు. చిన్న హీరోలు సైతం ప్రస్తుతం బైక్ పై తిరిగేందుకు అంతగా ఇష్టపడరు. కాని అజిత్ మాత్రం వందలు కాదు వేల వేల కిలో మీటర్లు బైక్ పై తిరిగేందుకు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఈ వయసులో కూడా అజిత్ రెగ్యులర్ గా బైక్ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. లాక్ డౌన్ టైములో హైదరాబాద్ నుండి చెన్నై వరకు అజిత్ బైక్ పై వెళ్లాడు అంటూ అనేక వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా వారణాసి ఇంకా ఉత్తర భారతం కు బైక్ రైడ్ చేస్తున్నాడని సమాచారం.

అజిత్ ఇప్పటికే 4500 కిలో మీటర్లను బైక్ పై ట్రావెల్ చేసి వారణాసి చేరుకున్నారు. వారణాసిలో బైక్ తో దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చెన్నై నుండి సిక్కింకు తన దగ్గరున్న బిఎండబ్ల్యు బైక్‌పై ట్రిప్‌ మొదలు పెట్టాడు అజిత్. ఇప్పటికే వారణాసిని చేరుకున్నాడు అజిత్. అక్కడ రెండు, మూడు రోజులు విశ్రాంతి ‌ తీసుకుని మళ్లీ సిక్కిం నుండి చెన్నై బైక్‌ పే వెళ్లి చేరుకుంటాడట. ఈ మొత్తం ట్రిప్‌ దూరం 4500 కి.మీ. ఇంత భారీ రైడ్ ను ఏ హీరో ఇప్పటి వరకు చేయలేదు అనడంలో సందేహం లేదు. ఒక హీరోగా ఇంత పెద్ద రైడ్ చేయడం రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఇంత అద్బుతమైన రికార్డును తన సొంతం చేసుకున్న అజిత్ త్వరలో వినోథ్ హెచ్ దర్శకత్వంలో రూపొందుతున్న వలిమై చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సరి కొత్త రికార్డును సొంతం చేసుకున్న హీరో అజిత్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts