
అవును, మీరు విన్నది నిజమే. ఇడ్లీ పెట్టిన వ్యక్తికి అక్షరాల లక్ష రూపాయిలు ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఇంతకీ ఆయన ఎవరో తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈయన పుట్టింది హైదరాబాద్లోనే. మొదటిసారి నటించింది కూడా తెలుగు సినిమాలోనే. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి సూపర్ స్టార్ అయ్యాడు. ఇక ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు.
నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అజిత్. ఇక సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ అజిత్ ఎప్పుడు మందే ఉంటాడు. ఇప్పటికే ఎందరికో తన వంతు సాయం అందించిన అజిత్.. తాజాగా మరోసారి గొప్పమనసు చాటుకున్నాడు. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్లోనే జరిగింది. అయితే షూటింగ్ సమయంలో అజిత్ సొంత బైక్ మీదే బయటకు వచ్చి ఓ ఇడ్లీ షాప్ వద్ద రోజు టిఫిన్ చేసేవాడట. ఈ క్రమంలోనే ఆ ఇడ్లీ బండి నడిపే వ్యక్తిని అతడి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడట. పిల్లలను చదివించడానికి చాలా కష్టమవుతుందని చెప్పడంతో.. వెంటనే అజిత్ వారి చదువుల కోసం లక్ష రూపాయల సాయం చేసాడు. అయితే ఈయనేం చేసినా కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంటాడు. కానీ, సాయం అందుకున్న వ్యక్తి చాటిచెప్పకుండా మానడు కదా. అలానే ఈ విషయం బయటకు వచ్చింది.