కిస్ ఇవ్వ‌లేద‌ని వదిలేసి వెళ్లింది : అక్ష‌య్ కుమార్‌!!

January 20, 2021 at 1:56 pm

బాలీవుడ్ ప్రముఖ హీరో అక్ష‌య్ కుమార్ త‌న మొదట ల‌వ్ స్టోరీని తాజాగా పంచుకున్నాడు. ట్వింకిల్ ఖ‌న్నాను పెళ్లి చేసుకున్న అక్ష‌య్‌ కుమార్ అంత‌కు ముందు ఒక అమ్మాయితో లవ్ స్టోరీ నడిపాడు. ఆ అమ్మాయితో డేటింగ్ చేసిన అక్ష‌య్ ఆమెకు న‌చ్చిన‌ట్లు లేకపోవడంతో ఆ అమ్మాయిని అక్ష‌య్‌ను వదిలి వెళ్ళిపోయింది. ఈ విష‌యాన్ని ద క‌పిల్ శ‌ర్మ షోలో అక్షయ్ స్వ‌యంగా చెప్పాడు.

టీనేజీలో ఓ అమ్మాయితో నాలుగైదు సార్లు డేటింగ్‌కు వెళ్ళాను, కలిసి సినిమాలు చూశాన‌ని, రెస్టారెంట్ కి వెళ్లి భోజ‌నం కూడా చేశామ‌న్నారు. కానీ ఆ త‌ర్వాత ఆమె నన్ను వ‌దిలి వెళ్ళిపోయింది అని చెప్పారు. తాను కిస్సు ఇవ్వ‌క‌పోవ‌డం హ‌త్తు కోక‌పోవ‌డం వ‌ల్లే ఆ అమ్మాయి త‌న‌ను వ‌దిలి వెళ్లిన‌ట్లు అక్ష‌య్ చెప్పుకొచ్చాడు. నేను తనని కిస్ చెయ్యాలి అన్న ఆలోచ‌న ఆ అమ్మాయికి ఉండేద‌న్నారు. కానీ నేను అలా చేయ‌లేక‌పోయాన‌ని, అందువ‌ల్లే ఆ అమ్మాయి న‌న్ను వ‌దిలేసి వెళ్లిన‌ట్లు అక్ష‌య్ కుమార్ తెలిపాడు.

కిస్ ఇవ్వ‌లేద‌ని వదిలేసి వెళ్లింది : అక్ష‌య్ కుమార్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts