
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా తమ వంతు విరాళాలను రామ మందిరానికి అందిస్తున్నారు. అంతేకాకుండా మందిరం నిర్మాణానికి తమవంతు సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా అందరికి పిలుపునిస్తున్నారు.
ఇటీవల ప్రణీత తనవంతు విరాళంగా లక్ష రూపాయాల అందించగా, ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కూడా విరాళం ఇచ్చినట్టు ప్రకటించాడు. ఒక వీడియో ద్వారా తాను విరాళం ఇచ్చినట్టు పేర్కొన్న అక్షయ్ కుమార్ దేశ ప్రజలందరు కూడా ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని, ఇందుకు బాధ్యతగా ప్రతి ఒక్కరు విరాళాలు అందించాలని ఆయన అన్నారు. గత ఏడాది ఆగస్టులో మన ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామమందిరానికి స్వయంగా భూమిపూజ చేయగా, ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు.