
అలియా భట్.. ప్రస్తుతం ఈ బ్యూటీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో అలియాకు ఇదే మొదటి చిత్రం. ఇటీవలె ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంది అలియా. అయితే తాజాగా ఈ అమ్మడు హాస్పటల్లో చేరింది.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలో అలియా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అలియా స్వల్ప అస్వస్థతకు లోనైంది. హైపరాసిడిటీ, అలసట, వికారంతో అలియా బాధపడుతుండడంతో ఆమెను వెంటనే చిత్ర యూనిట్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారట.
చికిత్స అనంతరం అదే రోజు అలియాను డిశ్చార్జ్ చేసారు ఆసుపత్రి సిబ్బంది. అనంతరం `గంగూభాయ్’ సెట్లో అడుగు పెట్టింది అలియా. అయితే ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో.. వైరల్‌గా మారింది. కాగా, ప్రస్తుతం అలియా గంగూభాయ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాటు బ్రహ్మాస్త్రలో నటిస్తుంది.