అల్ల‌రోడి `బంగారు బుల్లోడు`లో ఆక‌ట్టుకుంటున్న బాల‌య్య‌ సాంగ్‌!

January 21, 2021 at 9:42 am

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన తాజా చిత్రం `బంగారు బుల్లోడు`. ఈ చిత్రంలో అల్ల‌రోడికి జోడీగా పూజా జవేరి న‌టించింది. గిరి పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 23న థియేటర్స్‌లో విడుదల చేయ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే ట్రైల‌ర్ విడుద‌ల కాగా.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు అల్ల‌రి న‌రేష్ కంకణం కట్టుకున్నట్లు ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

అయితే ఈ చిత్రానికి బాల‌కృష్ణ న‌టించిన‌ బంగారు బుల్లోడు టైటిల్ పెట్ట‌డ‌మే కాదు.. ఆ చిత్రంలో `స్వాతిలో ముత్యమంత` పాటను కూడా రీమిక్స్‌ చేయడం విశేషం. ఇక విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. తాజాగా స్వాతిలో ముత్యమంత రీమిక్స్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

సాయి కార్తీక్ సంగీతం అందించగా.. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో.. యూట్యూబ్‌లో తెగ వైర‌ల్ అవుతోంది. మొత్తానికైతే క్లాసిక్ సాంగ్‌ని మళ్లీ గుర్తు చేసుకునేలా చేశారు అల్లరి నరేష్. కాగా, బంగారు ఆభరణాలు కుదువ పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో అల్లరి నరేష్ క‌నిపించ‌నున్నాడు.

అల్ల‌రోడి `బంగారు బుల్లోడు`లో ఆక‌ట్టుకుంటున్న బాల‌య్య‌ సాంగ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts