చిక్కుల్లో ప‌డ్డ ‘బంగారు బుల్లోడు’.. షాక్‌లో అల్ల‌రి న‌రేష్‌!

January 22, 2021 at 8:42 am

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన తాజా చిత్రం `బంగారు బుల్లోడు`. గిరి పాలిక దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో పూజా జవేరి హీరోయిన్‌గా న‌టించ‌గా.. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈనెల 23న ‘బంగారు బుల్లోడు’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే ఇలాంటి త‌రుణంలో ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై స్వర్ణకార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒకరి బంగారు వస్తువులకు ఇంకొకరి ఇస్తున్నట్టుగా చూపిస్తూ తమ వృత్తిని కించపరిచారని స్వర్ణకార సంఘాల నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. త‌మ వృత్తిని కించ‌ప‌రిచే ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలను సినిమ‌లో నుంచి తొలగించాలని కోరుతూ గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘాలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేశాయి.

అంతేకాదు, సినిమా విడుదలకు ముందు.. తమకు ప్రివ్యూ వేయాలన్నారు. లేని పక్షంలో తెలుగురాష్ట్రాల్లో బంగారుబుల్లోడు సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిక‌లు జారీ చేశారు. అలాగే నిమాలోని హీరోని స్వర్ణకారుడిగా చూపించినందుకు ద‌ర్శ‌క‌,నిర్మాత‌ల‌కు ధన్యవాదాలు చెబుతూనే.. సినిమాలో త‌న వృత్తిపై ప్ర‌జల్లో న‌మ్మ‌కం పోయే అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని తమ ఫిర్యాదులో ఇరు సంఘాలు పేర్కొన్నాయి. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

చిక్కుల్లో ప‌డ్డ ‘బంగారు బుల్లోడు’.. షాక్‌లో అల్ల‌రి న‌రేష్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts