
ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా గిరి పి. దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బంగారు బుల్లోడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్, పూజా ఝవేరి కలిసి జంటగా నటించిన ఈ సినిమాకి సంబంధించి అన్ని ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనవరి 23న బంగారు బుల్లోడును రిలీజ్ చేస్తున్నట్లు లేటెస్ట్ పోస్టర్ ద్వారా సినీ బృందం ప్రకటించింది.
హీరోయిన్ పూజా ఝవేరి స్కూటర్‌పై వెళ్తుంటే, వెనుక హీరో అల్లరి నరేష్ తన బృందంతో సరదాగా పాట పాడుతూ ఆమె వెంట పడుతున్నట్లు ఆ పోస్టర్లో కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చిన పాటలన్నింటినీ రామజోగయ్య శాస్త్రి రచించారు. అల్లరి నరేష్ కెరీర్లో మరో చక్కని హాస్యభరిత చిత్రంగా బంగారు బుల్లోడు మూవీ పేరు తెచ్చుకుంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తాయనీ దర్శకుడు అన్నారు.