ఒకే సినిమాలో బ‌న్నీ, అర్జున్ రెడ్డి.. ఇక ఫ్యాన్స్‌కు పూన‌కాలే?

January 27, 2021 at 9:25 am

ఇటీవ‌ల కాలంలో మల్టీస్టారర్ సినిమాల‌కు క్రేజ్ పెరిగిపోతోంది. స్టార్ హీరోలు సైతం క‌లిసి న‌టించేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయడం లేదు. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌-రామ్ చ‌ర‌ణ్‌ల `ఆర్ఆర్ఆర్‌`, వెంక‌టేష్‌-వ‌రుణ్ తేజ్ `ఎఫ్‌3` మ‌రియు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-రానా కాంబోలో ఓ సినిమా ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్నాయి.

అయితే తాజాగా ఓ క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ తెర‌పైకి వ‌చ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతున్నార‌ట‌. ఆనందో బ్రహ్మ, యాత్ర చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడని తెలుస్తోంది.

అంతేకాదు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల మహి.. బ‌న్నీ మ‌రియు విజ‌య్‌ల‌కు లైన్ చెప్ప‌గా.. ఈ ఇద్దరు హీరోలకు నచ్చినట్లు, ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. మ‌రి ఇదే నిజ‌మైతే.. అటు అల్లు అర్జున్‌.. ఇటు అర్జున్ రెడ్డి అభిమానుల‌కు ఫూన‌కాలే అని చెప్పాలి.

ఒకే సినిమాలో బ‌న్నీ, అర్జున్ రెడ్డి.. ఇక ఫ్యాన్స్‌కు పూన‌కాలే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts