`పుష్ప‌` నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. ఫుల్ ఖుషీలో బన్నీ ఫ్యాన్స్‌!

January 28, 2021 at 11:25 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

బ‌న్నీ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప టీమ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ అప్‌డేట్ ఏంటో కాదు.. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని పుష్ప యూనిట్‌ ట్విటర్ ద్వారా తెలియ‌జేస్తూ.. ఓ పోస్ట‌ర్ కూడా రివిల్ చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో అల్లు అర్జున్.. చేతిలో గొడ్డలి పట్టుకొని ఎర్ర చందనం చెట్లు నరికిన తర్వతా తన తోటి వాళ్లతో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. ఇక పుష్ప విడుద‌ల తేదీ ప్ర‌క‌టించ‌డంతో.. బ‌న్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Image

`పుష్ప‌` నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. ఫుల్ ఖుషీలో బన్నీ ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts