ఆ పాత సినిమాతో కొత్త రికార్డు క్రియేట్ చేసిన బ‌న్నీ.. ఖుషీలో ఫ్యాన్స్‌!

January 24, 2021 at 8:11 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వ‌చ్చిన `డీజే(దువ్వాడ జగన్నాథం)` చిత్రం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రంలో సంప్రదాయ బ్రాహ్మణ యువకుడి పాత్రలో తనదైన నటన కనబరిచాడు.

2017 జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. భారీగానే వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో క్రేజీ రికార్డును సృష్టించింది. మూడేళ్ళ కింద విడుదలైన ఈ సినిమా ఇప్పుడు యూ ట్యూబ్‌లో ఏకంగా 300 మిలియన్ వ్యూస్ దాటేసింది.

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకీ నాయక, అల్లు అర్జున్ సరైనోడు సినిమాలు మాత్రమే 300 మిలియన్ వ్యూస్ దాటాయి. ఇప్పుడు ఈ చిత్రాల జాబితో డీజే కూడా చేరింది. 300 మిలియన్ వ్యూస్ దాటిన మూడో సినిమాగా డీజే నిలిచింది. కాగా, బ‌న్నీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆ పాత సినిమాతో కొత్త రికార్డు క్రియేట్ చేసిన బ‌న్నీ.. ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts