పిల్లులతో అమలా పాల్ క్యూట్ పోజులు.. వైర‌ల్‌గా ఫొటోలు!

January 24, 2021 at 10:32 am

అమలా పాల్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన `నాయక్` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అమ‌లా.. ఇద్దరమ్మాయిలతో చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇక ఈమె న‌టించి ఇత‌ర భాష‌ల సినిమాలు కూడా తెలుగులో డ‌బ్ అవ్వ‌డంతో.. అమ‌లాకు స్పెష‌ల్ ఇమేజ్ ఏర్ప‌డింది.

Image

ఇక ప్ర‌తి విష‌యంపై బోల్డ్‌గా మాట్లాడే అమ‌లా.. ఇటీవ‌ల‌ ‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఓటీటీలో కూడా ప్ర‌వేశించిన అమ‌లా.. వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌లో నటిస్తోన్న అమలా పాల్.. ఆహా ఓటీటీ వేదిక కోసం ‘కుడి ఎడమైతే’ అనే మరో తెలుగు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు.

Image

మ‌రోవైపు సోష‌ల్ మీడియా కూడా య‌మా యాక్టివ్‌గా ఉండే అమ‌లా.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. తాజాగా కూడా అమ‌లా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో చిన్న చిన్న పిల్లులతో ఆడుకుంటూ.. క్యూట్ పోజులు ఇస్తూ క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Image

Image

పిల్లులతో అమలా పాల్ క్యూట్ పోజులు.. వైర‌ల్‌గా ఫొటోలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts