
ఓటీటీ వినియోగదారుల కోసం ఎయిర్టెల్, అమెజాన్ సంయుక్తంగా ఒక శుభవార్త ప్రకటించింది. ఎయిర్ టెల్ వినియోగదారులు ఇకపై కేవలం రూ. 89కే ప్రైమ్ వీడియోను వీక్షించేందుకు ఈ బంపర్ ఆఫర్ కల్పిస్తోంది. అయితే ఇది కేవలం మొబైల్ వినియోగదారులకు మాత్రమే లభ్యమయ్యే మోబైల్ ఎడిషన్ ప్లాన్. ఇందులో భాగంగా ఎస్డీ ఫార్మాట్లో వీడియోలు చూడవచ్చు. బండల్డ్ ప్రీ-పెయిడ్ ప్యాక్స్ రూపంలో వినియోగదారులకు ఎయిర్ టెల్ ఈ ఆఫర్ అందిస్తోంది.
ప్రారంభ ప్యాక్ ధర కేవలం 89 రూపాయలు. దీనితో ప్రైమ్ వీడియోతో పాటూ 6జీబీ డాటా కూడా లభిస్తుంది. తొలి 30 రోజులు ఫ్రీ ట్రైయల్గా ప్రైమ్ వీడియోను వీక్షించవచ్చు. ఇక రూ. 299 ఆఫర్‌తో రోజుకు 1.5జీబీ డాటాతో 28 రోజుల పాటు ప్రైమ్ వీడియోను వీక్షించవచ్చు. స్మార్ట్ వినియోగం ఎక్కువగా ఉన్న భారత్ కోసం ప్రత్యేకంగా అమెజాన్ ఈ గోల్డెన్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.