ఆ క్రికెటర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహేంద్ర..!?

January 24, 2021 at 3:41 pm

పట్టుదల ఉంటే ఏదన్నా సాధ్యమే అని నిరూపించారు మన టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్స్. ఇన్నేళ్ళుగా మన ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా ప్లేయర్స్ కి చుక్కలు చూపించారు మన వాళ్లు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తిరుగులేని చరిత్రను సృష్టించింది. బ్రిస్బేన్ 33ఏళ్ల తర్వాత ఓటమిని రుచి చూపించింది మన టీమ్ ఇండియా. నాలుగో టెస్టులో చాకచక్యంగా ఆడి మూడు వికెట్ల తేడాతో గెలవడమే కాకుండా టెస్టు సిరీస్ ను గెలిచింది. మొట్టమొదటి 1988లో ఓడిపోయిన ఆసీస్ ఇన్నేళ్లుగా ఓటమి ఎరుగకుండా ముందుకు సాగింది.మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఓటమిని చవి చూసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మీద చారిత్రక విజయం నమోదు చేసుకున్న టీమిండియాకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే శనివారం ఆనంద్ మహీంద్రా ఈ ఆస్ట్రేలియా సిరీస్ లో అరంగ్రేట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్లకు ఎస్యూవీ గిఫ్ట్ గా ఇస్తానని ట్వీట్ లో వెల్లడించడం విశేషం.

అంతేకాకుండా ఆనంద్ మహీంద్రా ఇలా వివరణ కూడా ఇచ్చారు. ఇటీవల జరిగిన చారిత్రక సిరీస్ విజయంలో ఆరుగురు క్రికెటర్లు అరంగ్రేట సిరీస్ ఆడారు. వారంతా భవిష్యత్ జనరేషన్ల కలలను సాకారం చేసుకునేందుకు ఉదాహరణగా నిలిచారు. వారందరివి నిజమైన జీవిత గాథలు. ఎక్సెలెన్స్ కు ఉదాహారణగా నిలిచాయి. జీవితంలో ప్రతి జరిగిన ప్రతి సంఘటనకు ఇన్ స్పిరేషన్ అయ్యారు.అది నాకు వ్యక్తిగతంగా చాలా గొప్పగా అనిపించింది. అందుకే నూతనంగా సిరీస్ లో ఆడిన వారందరికీ న్యూ థార్ ఎస్యూవీని నా సొంత ఖర్చుతో గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను.

అయితే దీనికి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ గిఫ్ట్ ఇవ్వడానికి కారణం కూడా ఉంది.. యువత తమను తాము నమ్ముకుని,మంచి విజయాల్ని సాధించి,అభివృద్ధి పధంలో ముందుకు సాగిపోవాలని అనుకుంటున్నా అని రాసుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే ఈ సిరీస్ లో ఆడిన మొహమ్మద్ సిరాజ్, శుబ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ కు ఈ ఖరీదైన కార్లు అందేలా ఉన్నాయి. 2018-19లో కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసిన మన టీమిండియాకు మళ్ళీ రెండో విజయాన్ని సాధించడానికి కొంచెం సమయం పెట్టిందనే చెప్పవచ్చు.

ఆ క్రికెటర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహేంద్ర..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts