” థాంక్యు బ్రదర్ ” చిత్రం టీజర్ రిలీజ్ ..!!

January 28, 2021 at 4:50 pm

యాంకర్ అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా థాంక్‌ యు బ్రదర్‌. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి రూపొందిస్తున్నారు. కరోనాకి సంబంధించిన ఘటనలను ఆధారం చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు సమాచారం. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, వీడియో బట్టి మాస్క్‌ ప్రాధాన్యం చెప్పడంతో పాటు కథలో లిఫ్ట్‌కి కీలక పాత్ర ఉన్నట్టు అర్థమవుతోంది.

ఇంతక ముందు చిత్రం మోషన్‌ పోస్టర్‌ను హీరో ప్రిన్స్ మహేశ్‌బాబు విడుదల చేయగా తాజాగా ట్రైలర్‌ను విక్టరీ ఈ రోజు సాయంత్రం 4.05ని.ల‌కు వెంక‌టేష్ చేతుల మీదుగా మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. భ‌యంక‌ర‌మైన శ‌బ్ధాల‌తో అన‌సూయ‌, అశ్విన్ లిఫ్ట్‌లో ఇరుక్కొని భ‌యంతో కూడిన సన్నివేశాలతో ఈ చిత్రం టీజర్ కొనగతుంది. అయితే ప్లేబాయ్ లాంటి అభి, ప్రెగ్నెంట్ అయిన ప్రియ లిఫ్ట్‌లో ఉండ‌గా ప‌వ‌ర్ కట్ అవ్వటంతో, లిఫ్టులో చిక్కుకుపోయి ఉన్నప్పుడు ఎ లాంటి ప‌రిస్థితులు ఎద్దురయ్యాయి అనేది చిత్రం యొక్క ప్రధాన కథ. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన వారు ఇద్దరు ప్రాణాలతో ఎలా బయట పడ్డారు. గర్భవతి అయినా అనసూయాను లిఫ్టులో పురిటి నొప్పులతో బాధ పడుతున్న సమయంలో అశ్విన్ తనని ప్రమాదం నుండి ఎలా తప్పించాడు వంటి సన్నివేశాలతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ చిత్రం క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు సరి కొత్త అనుభూతిని ఇచ్చే విధంగా మూవీ తీర్చిదిద్దారని ట్రైల‌ర్‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రం ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన అనంతరం విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ, థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ మూవీ టైటిల్‌తో పాటు ట్రైల‌ర్ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ ర‌మేష్ ఈ చిత్రాన్ని చేసిన‌ట్లు అనిపించింది. అశ్విన్ విరాజ్‌, అన‌సూయ లుక్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కోవిడ్ సమయంలో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. సినిమాలో చాలా స‌స్పెన్స్ సన్నివేశాలు ఉన్నాయి. పరిచయం లేని వ్య‌క్తులు లిఫ్ట్‌లో ఇరుకుపోతే ఏమ‌వుతుందో అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తీశారు. అన‌సూయ ఔట్‌స్టాండింగ్‌గా చేసినట్లు అనిపిస్తోంది. నిర్మాత‌లు శ‌ర‌త్‌, తార‌క్‌నాథ్‌ల‌కు ఆల్ ద వెరీ బెస్ట్‌. ఇలాంటి సరి కొత్త కాన్సెప్ట్‌ల‌ను ఈ మధ్య ప్రేక్ష‌కులు బాగా ఎంక‌రేజ్ చేస్తున్నారు. దర్శకుడు ర‌మేశ్ ఇలాంటి కథను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆద‌రిస్తార‌ని కచ్చితంగా న‌మ్ముతున్నాను. మూవీ టీమ్ మొత్తానికి వెంకటేష్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ కానున్న ఈ మూవీని అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలి అని ఆయన అన్నారు. ఈ మూవీ టీజర్ ని మీరు కూడా ఒక లుక్కువేయండి.

” థాంక్యు బ్రదర్ ” చిత్రం టీజర్ రిలీజ్ ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts