యాంకర్ ప్రదీప్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

January 24, 2021 at 11:08 am

ప్రదీప్ మాచిరాజు.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రేడియో జాకీగా కెరీర్‌ని ప్రారంభించిన ప్ర‌భాస్‌.. ఆ త‌ర్వాత బుల్లితెరపై పలు షోలకు యాంక‌రింగ్ చేయ‌డం స్టార్ట్ చేశారు. పలు షోలు రియాలిటీ షోలు సినిమా ఇంటర్వ్యూలు చేస్తు తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన ప్ర‌దీప్.. ప్ర‌స్తుతం బుల్లితెర టాప్‌ మెయిల్ యాంక‌ర్‌గా కొన‌సాగుతున్నాడు.

మ‌రోవైపు వెండితెర‌పై సైతం చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ వ‌చ్చిన ప్ర‌దీప్‌.. ఇప్పుడు `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మొత్తానికి అటు టీవీ షోల‌తో, ఇటు సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న ప్ర‌దీప్‌.. నెల‌కు ఎంత సంపాదిస్తున్నాడు అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌దీప్ నెల‌కు దాదాపు రూ. 40 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నాడ‌ని అంటున్నారు.

రెండేళ్ల కిందట టీవీ షోల‌లో ఒక్కో ఎపిసోడ్‌కు 75 వేల వరకు తీసుకున్న ప్రదీప్ ఇఫ్పుడు 1.25 లక్షలకు పైగానే తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవ‌ల ఈయ‌న న‌టించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రానికి పాతిక ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకున్నాడ‌ట‌. ఏదేమైనా నెల మొత్తం షూటింగ్ల‌తో బిజీగానే ఉండే ఈయనకు ఈ మాత్రం ఆదాయం రావడం కామన్ విష‌య‌మే అని చెప్పాలి.

యాంకర్ ప్రదీప్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts