నా కల తీరడానికి పదేళ్ళు పట్టింది: యాంకర్ ప్రదీప్

January 25, 2021 at 2:48 pm

బుల్లితెరపై టాప్ యాంకర్స్ లో ప్రదీప్ ఒక్కరు. ఆయన మాటలతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ప్రదీప్. గడసరి అత్తా సొగసరి కోడలు ప్రోగ్రాంతో బుల్లితెరపై తెరంగ్రేటం చేశాడు ప్రదీప్. ఇక వరుస షోలను చేస్తూ టాప్ యాంకర్స్ లో ఒక్కరిగా ఉన్నారు. బుల్లితెర టాప్‌ యాంకర్‌ ప్రదీప్ తొలిసారి హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’

ఇక సగటు మధ్యతరగతి అబ్బాయిల్లానే నేనూ హీరో కావాలని కలలు కన్నాను. పదేళ్ల కష్టం తర్వాత ఈ చిత్రంతో ఆ కోరిక తీరింది. గీతా ఆర్ట్స్‌, యువీ క్రియేషన్స్‌ లాంటి సంస్థలు మా సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉంది’’ అని ప్రదీప్‌ మాచిరాజు అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృతా అయ్యర్‌ కథానాయిక నటించారు. ఈ చిత్రానికి ప్రదీప్‌ (మున్నా) దర్శకత్వంలో ఎస్‌. వి. బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

ఇక ఇటీవల ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయిందని ఆయన అన్నాడు. ఇక ఈ చిత్రంలో ‘నీలి నీలి ఆకాశం..’ పాట అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమాను గుర్తుండేలా చేసింది. ఈ క్రెడిట్‌ తెర వెనకున్న హీరోలు అనూప్‌ రూబెన్స్‌, చంద్రబోస్‌కు దక్కుతుందని ఈ సందర్భాంగా తెలియజేశారు. అంతేకాక చక్కని ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు.

అయితే కథ విన్నప్పుడు మేం ఎలా కనెక్ట్‌ అయ్యాయో సినిమాతో ప్రేక్షకులు కూడా అలా కనెక్ట్‌ అవుతారు. ‘నీలి నీలి..’ పాట ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయింది. పాటలానే ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవ్వాలి’’ అని అనూప్‌ రూబెన్‌ అన్నారు. ‘‘నీలి నీలి ఆకాశం పాట ఇచ్చిన స్ఫూర్తితో ఇకమీదట చిన్న చిత్రాలకు ఇలాంటి మంచి పాటలు రాసేందుకు ప్రయత్నిస్తాను’’ అని చంద్రబోస్‌ అన్నట్లు తెలియజేశారు.

నా కల తీరడానికి పదేళ్ళు పట్టింది: యాంకర్ ప్రదీప్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts