సుమ‌క్కతో వంట‌ల‌క్క‌‌.. బుల్లితెర‌పై క‌లిసి సంద‌డి చేయ‌నున్న స్టార్లు!

January 22, 2021 at 10:47 am

బుల్లితెరపై నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్‌గా టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న‌ కార్తీక దీపం ద్వారా ప‌రిచ‌య‌మైన వంట‌ల‌క్క అలియాస్ ప్రేమి విశ్వ‌నాథ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ సీరియ‌ల్ ద్వారా హీరోయిన్ రేంజ్‌లో వంట‌ల‌క్క ఫాలోంగ్ సంపాదించుకుంది. ఇక మ‌రోవైపు గ‌త కొన్నేళ్లుగా త‌న యాంక‌రింగ్‌తో బుల్లితెర‌ను ఏలేస్తున్న సుమ‌క్క అలియాస్ సుమ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్‌లో ఓ యాడ్ రాబోతోంది. ఇప్పటి వరకు సుమ చేస్తున్న యాడ్‌లో ఇప్పుడు ప్రేమీ విశ్వనాథ్ కూడా చేరుతోంది. (Image: Premi Viswanath/ Instagram)

అయితే ఈ ఇద్ద‌రు బుల్లితెర స్టార్లు.. స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నారు. అవును, వారిద్దరి కాంబినేషన్‌లో ఓ యాడ్ రాబోతోంది. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు యాడ్‌లో ఇప్పటి వరకు యాంకర్ సుమను మాత్రమే బుల్లితెర ప్రేక్ష‌కులు చూశారు.

 యాంకర్ సుమ, కార్తీకదీపం వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ఈ రెండు పేర్లూ టీవీ ఉన్న ప్రతి ఇంట్లోనూ మార్మోగుతూ ఉంటాయి. ఇలాంటి ఇద్దరూ కలసి ఒకే సారి స్క్రీన్ మీద కనిపిస్తే ఇక మహిళలకు పండగే. (Image: Premi Viswanath/ Instagram)

కానీ, ఇక‌పై సుమ‌క్క‌‌తో పాటుగా వంట‌ల‌క్క‌ను కూడా చూడ‌బోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి.. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు యాడ్ షూట్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయానా ప్రేమీ విశ్వనాథ్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఏదేమైనా ఒక ఫ్రేమ్‌లో ఇద్ద‌రు బుల్లితెర స్టార్లు సంద‌డి చేస్తే.. అభిమానుల‌కు పండ‌గే అని చెప్పాలి.

 

సుమ‌క్కతో వంట‌ల‌క్క‌‌.. బుల్లితెర‌పై క‌లిసి సంద‌డి చేయ‌నున్న స్టార్లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts