`ఎఫ్ 3`లో మ‌రో హీరో.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి!

January 26, 2021 at 12:04 pm

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 రాబోతోంది. ఇటీవ‌లె పూజ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

అయితే ఈ సినిమా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టి నుంచి.. ఇందులో వెంకీ, వ‌రుణ్‌ల‌తో పాటు మ‌రో హీరో కూడా ఉండ‌బోతున్నాడు అనే వార్త తెగ వైర‌ల్ అవుతోంది. కానీ, దీనిపై చిత్ర యూనిట్ స్పందించ‌లేదు. క్ర‌మంలోనే గ‌త కొద్ది రోజులుగా మూడో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌నున్నాడ‌నే వార్త మ‌రింత ఊపందుకుంది.

అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూవి స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఎఫ్ 3 సినిమాలో మూడో హీరోగా ఎవరు చేయడం లేదని.. అసలు తనకు ఆ మూడో హీరో అన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఎఫ్ 2 లాగే ఎఫ్ 3 కూడా ఇద్దరు హీరోలతో మాత్రమే చిత్రీకరిస్తానని స్ప‌ష్టం చేశారు. మ‌రి ఇప్ప‌టికైనా ఈ రూమ‌ర్స్ ఆగుతాయో లేదో చూడాలి. కాగా, ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లుగా న‌టించ‌నుండ‌గా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

`ఎఫ్ 3`లో మ‌రో హీరో.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts