హీరోగా మరో డాన్సర్.. !!

January 20, 2021 at 2:02 pm

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ ‌రాజు ఒకరు. సినీ పరిశ్రమకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు, దర్శకులను పరిచయం చేసారు ఆయన. అయితే ఇప్పుడు మరో హీరోను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. డాన్స్ మాస్టర్ యశ్‌ను హీరోగా పరిచయం చేయడానికి దిల్‌ రాజు సన్నాహాలు మొదలు పెట్టారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే డాన్స్ మాస్టర్ జానీ కూడా హీరోగా మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు డాన్స్‌మాస్టర్ యశ్ కూడా హీరోగా మారనున్నాడు.

దీనికి దిల్ రాజు అంతా రెడీ చేశాడట. అయితే ఇప్పటికే దిల్‌రాజు నిర్మెస్తున్న వకీల్‌సాబ్ మూవీ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్‌లు చేస్తున్న ఎఫ్3 సినిమా చిత్రీకరణలో ఉంది. ఈక్రమంలో దిల్‌రాజు నిర్మిస్తున్న మరో మూడు సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం వకీల్‌సాబ్ తరువాత దిల్ ‌రాజు చిన్న చిత్రాలపై దృష్టి పెట్టనున్నాడు. ఈ క్రమంలోనే డాన్సర్ మాస్టర్ యశ్‌ను హీరోగా పరిచయం చేయనున్నారట.

హీరోగా మరో డాన్సర్.. !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts