`ఫ్రీడమ్ @ మిడ్‏నైట్`.. యూట్యూబ్‏లో అనుప‌మ‌ రికార్డుల వేట‌!

January 28, 2021 at 10:28 am

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అ ఆ` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. `శతమానం భవతి` సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్‌గా మార‌డంతో పాటు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగానే ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు త‌లుపు త‌ట్టినా.. గ‌త కొంత కాలంగా మాత్రం అనుప‌మ జోరు త‌గ్గింద‌నే చెప్పాలి.

ఇలాంటి త‌రుణంలో తాజాగా అనుపమ ఓ షార్ట్ ఫిల్మ్‏లో నటించింది. ఆర్జే షాన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో అనుపమ పరమేశ్వరన్, హక్కిమ్ షాజహాన్ జంట‌గా న‌టించారు. అఖిల్​ మిధున్​ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇటీవ‌ల ఈ షార్ట్ ఫిల్మ్ తెలుగు, మలయాళం వెర్షన్లను యూట్యూబ్‌లో విడుద‌ల చేయ‌గా‌.. ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ఈ షార్ట్ ఫిల్మ్‌ ప్రతి ఒక్కరికీ టచ్ అయ్యే రియలిస్టిక్ డ్రామా అన‌డంలో సందేహం లేదు. ఇక ప్ర‌స్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ.. యూట్యూబ్‌లో రికార్డుల వేట మొద‌లుపెట్టింది. జనవరి 9న విడుదైలన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటివరకు దాదాపు 5 మిలియన్ వ్యూస్‏ని దక్కించుకుని టాప్ ట్రెండింగ్ నిలిచింది. మ‌రి ముందు ముందు ఈ షార్ట్ ఫిల్మ్‌తో అనుప‌మ ఇకెందు రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

`ఫ్రీడమ్ @ మిడ్‏నైట్`.. యూట్యూబ్‏లో అనుప‌మ‌ రికార్డుల వేట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts